భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఆర్థరాత్రి నుంచి ఎడతెరపి లెకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై మహా నగరం ఉలిక్కిపడింది! మరీ ముఖ్యంగా దక్షిణ- మధ్య ముంబైలో తెల్లవారుజామున చాలా తీవ్రంగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ముంబైలో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

"తెల్లవారుజాము 4:30 గంటల అప్‌డేట్. గత 3 గంటలుగా దక్షిణ, మధ్య ముంబై అంతటా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 గంటల పాటు కూడా కుండపోత వర్షం కొనసాగే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉంది," అని ఎక్స్​లో వాతావరణ అప్డేట్స్​కి చెందిన పోస్ట్ కనిపించింది.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైకి సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటల వరకు 'రెడ్​ అలర్ట్' జారీ చేసింది. రోజంతా ఉరుములతో కూడిన మెరుపులు, భారీ వర్షాలు ఉంటాయని అంచనా వేసింది. సెప్టెంబర్ 16 మంగళవారం వరకు యెల్లో అలర్ట్​ హెచ్చరికలు కొన...