భారతదేశం, మార్చి 23 -- స్టాక్ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేయడం చాలా సవాలుతో కూడుకున్నది. ఎక్కువ లాభాలు పొందడమే కాదు నష్టాలు చూడకుండా ఉండాలంటే కూడా తీవ్రమైన పరిశోధన, ఓపిక అవసరం. అంత రీసెర్చ్​ చేసిన తర్వాత మల్టిబ్యాగర్​ స్టాక్​లో ఇన్వెస్ట్​ చేస్తే మాత్రం ఊహకు అందని లాభాలు కనిపిస్తాయి. ఈ రోజు మేము మీకు అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి చెబుతున్నాము. ఆ కంపెనీ పేరు బాంబే బుర్మా ట్రేడింగ్ కార్పొరేషన్​. ఈ పెన్నీ స్టాక్ బాంబే బుర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ ధర 2003లో రూ.7.60గా ఉండేది. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో షేరు ధర రూ.1,772 వద్ద ముగిసింది. అంటే గత 22 ఏళ్లలో ఈ స్టాక్ 23,218 శాతం రాబడిని ఇచ్చింది! అంటే 22 ఏళ్ల క్రితం ఈ స్టాక్​లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే కాలక్రమేణా ఉంచితే ఈ మొత్తం రూ.2.33 కోట్లకు పెరిగి ఉండేది! ఇక ఇప...