భారతదేశం, మార్చి 26 -- 'ముఫాసా: ది లయన్ కింగ్' సినిమా ప్రపంచవ్యాప్తంగా బంపర్ హిట్ కొట్టింది. సింహాలతో పాటు అడవిలో జంతువులతో సాగే ఈ హాలీవుడ్ చిత్రం బ్లాక్‍బస్టర్ సాధించింది. గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. అంచనాలను నిలబెట్టుకుంది. ఆరేళ్ల కిందట వచ్చిన అదరగొట్టిన ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్‍గా ముఫాసా వచ్చింది. ఈ ముఫాసా: ది లయన్ కింగ్ ఓటీటీలోకి నేడు రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

ముఫాసా: ది లయన్ కింగ్ చిత్రం జియోహాట్‍స్టార్ ఓటీటీలో నేడు (మార్చి 26) స్ట్రీమింగ్‍కు రానుంది. నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు స్ట్రీమింగ్ మొదలుకానుంది. రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍‍కు అడుగుపెట్టనుంది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమ్ కానుంది.

ముఫాసా సినిమా రెగ్యులర్ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూడగా ...