భారతదేశం, ఏప్రిల్ 16 -- Moto G64 price in India : కొన్ని వారాలుగా కొనసాగుతున్న రూమర్స్​కి చెక్​ పెడుతూ.. సరికొత్త స్మార్ట్​ఫోన్​ని ఇండియాలో లాంచ్​ చేసింది మోటోరోలా. దీని పేరు మోటో జీ64. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. మోటో జీ62, మోటో జీ54 వంటి మిడ్-రేంజ్ సెగ్మెంట్​ గ్యాడ్జెట్స్​ నుంచి ఈ మొబైల్​ ఇన్స్​పిరేషన్​ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మోటో జీ 64 5జీ ప్రత్యేకమైన ఫీచర్లలో ఒకటి.. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్. ఇది భారతదేశంలో మొట్టమొదటిదని కంపెనీ పేర్కొంది. ఫీచర్ల నుంచి ధర వరకు.. ఈ మోటో జీ64 5జీ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

మోటో జీ64 5జీలో 6.5 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ ఐపీఎస్ ఎల్​సీడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటివి ఉన్నాయి. ఈ ప్యానెల్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. టచ్ శాంప్లింగ్ రేటు 240 హెర్ట్జ్ కు మద్దతు ఇస్తుంది. ...