భారతదేశం, మార్చి 11 -- భారత దేశంలో పెరిగిపోతున్న కాలుష్యంపై బయటకు వస్తున్న నివేదికలు సర్వత్రా ఆందోళనలు పెంచుతున్నాయ. దాదాపు ప్రతి రిపోర్టులో భారత దేశ పరిస్థితి అద్వానంగా ఉండటం గమనార్హం. స్విస్​ ఎయిర్​ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQAIR ప్రకారం ప్రపంచంలోని టాప్​ 20 కలుషిత నగరాల్లో 13 ఇండియాలోనే ఉన్నాయి!

ఐక్యూఎయిర్ రూపొందించిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం అసోంలోని బైర్నిహాట్​.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య రాజధాని నగరంగా దిల్లీ నిలిచింది.

నివేదిక ప్రకారం.. 2024 సగటున 50.6 మైక్రోగ్రామ్​ పర్​ క్యూబిక్​ మీటర్​ చొప్పు పీఎం2.5 కాన్సెట్రషన్​ 7శాతం పడింది. 2023లో ఇది 54.4 మైక్రోగ్రామ్స్​ పర్​ క్యూబిక్​ మీటర్​గా ఉండేది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో టాప్​ 10 కాలుష్య నగరాల్లో 6 ఇండియాలోనే ఉన్నాయి...