భారతదేశం, ఫిబ్రవరి 14 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అగ్రరాజ్యంలో అక్రమ వలసదారుల సమస్య గురించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులు చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తుంటే, వారిని వెనక్కి తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు.

"సాధారణంగా అక్రమ వలసదారులు సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉంటారు. వారికి పెద్ద పెద్ద కలలు ఆశ చూపించి, వారిని తప్పుదోవపట్టించి అక్రమంగా తీసుకెళుతుంటారు. అమెరికాలో అక్రమంగా జీవిస్తున్న భారత పౌరులను వెనక్కి తీసుకెళ్లడానికి మేము సిద్ధం," అని మోదీ అన్నారు.

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి వలసదారులపై ట్రంప్​ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా జీవిస్తున్న వారిని ట్రంప్​ యంత్రాంగం ...