భారతదేశం, ఏప్రిల్ 5 -- దిగ్గజ టెక్​ సంస్థ మైక్రోసాఫ్ట్​ 50ఏళ్లు పూర్తి చేసుకుంది! అర్ధశతాబ్దం క్రితం, 1975 ఏప్రిల్ 4న బిల్ గేట్స్- పాల్ అలెన్ అనే ఇద్దరు మిత్రులు ఒక చిన్న వెంచర్​గా మైక్రోసాఫ్ట్​ని ప్రారభించి, తక్కువ కాలంలోనే సంచలనం సృష్టిచారు. 2000 సంవత్సరం వరకు కంపెనీ సీఈఓగా పనిచేసిన బిల్ గేట్స్ 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అరుదైన 'త్రోబ్యాక్' ఫోటోలను షేర్​ చేశారు.

సోఫాలో కూర్చొని సెల్ఫీ తీసుకుంటున్న వీడియోను బిల్​ గేట్స్​ షేర్ చేశారు. "మైక్రోసాప్ట్​ ప్రారంభ రోజుల ఫొటోలు ఇవి. దురదృష్టవశాత్తు, నేను మళ్లీ అంత కూల్​గా ఉండలేను," అని రాసుకొచ్చారు.

ఈ వీడియోలో యంగ్​ గేట్స్​కి చెందిన వివిధ వెర్షన్లు కనిపిస్తాయి. ఆనాటి ఫ్యాషన్​ ట్రెండ్స్​ని బిల్​ గేట్స్​ ఎలా అనుసరించారో వీటిల్లో చూడవచ్చు.

'హ్యాపీ బర్త్ డే @microsoft. జ్ఞాపకాలకు ధన్యవ...