భారతదేశం, ఫిబ్రవరి 26 -- ఇండియాలో అతి తక్కువ ధరకు లభిస్తున్న ఎలక్ట్రిక్​ వాహనాల్లో ఎంజీ కామెట్​ ఈవీ ఒకటి. దీని సైజు చాలా తక్కువగా ఉండటంతో, సిటీ డ్రైవ్​కి మంచి ఆప్షన్​గా ఈ మోడల్​కి సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కామెట్​ ఈవీలో కొత్త ఎడిషన్​ని లాంచ్​ చేసింది జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​. దీని పేరు ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్. దీని రూ.7.80 లక్షలు+ బ్యాటరీ రెంటల్ ​​కిలోమీటర్ కు రూ.2.5గా నిర్ణయించారు. బ్యాటరీ రెంటల్ ఆప్షన్ లేని ఈ ఎలక్ట్రిక్​ కారు కొత్త స్పెషల్ ఎడిషన్ ధరను ఇంకా వెల్లడించలేదు. బుకింగ్ మొత్తాన్ని రూ.11,000గా నిర్ణయించామని, త్వరలోనే డెలివరీలు ప్రారంభిమవుతాయని సంస్థ పేర్కొంది. కొత్త స్పెషల్ ఎడిషన్ కామెట్ ఈవీ.. టాప్-ఎండ్ వేరియంట్​గా ఉంది.

ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ఇప్పుడు స్టార్రీ బ్లాక్ ఎక్స్​టీ...