భారతదేశం, డిసెంబర్ 13 -- బాయిలోనా బల్లి పలికే, రారా రక్కమ్మ లాంటి సాంగ్స్ తో ఉప్పల్ స్టేడియాన్ని ఉపేసింది మంగ్లీ.

తెలంగాణ పాపులర్ సింగర్ మంగ్లీ తన పాటలతో ఉప్పల్ స్టేడియంలో జోష్ తెచ్చింది. రేలారే రేలారే, ఎల్లమ్మ పాటలతో అదరగొట్టింది.

మెస్సి కోసం సాంగ్ ను డెడికేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ సాంగ్ కు స్టేడియంలోని ఫ్యాన్స్ స్టెప్పులేశారు.

తాజ్ ఫలక్ నూమా ప్యాలెస్ లో ఫుట్ బాల్ స్టార్ లియొనెల్ మెస్సీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.

హైదరాబాద్ చేరుకున్న మెస్సి ఇప్పుడు తాజ్ ఫలక్ నూమా ప్యాలెస్ లో ఉన్నాడు. అక్కడ ఫ్యాన్స్ తో మాట్లాడుతున్నాడు. రూ.10 లక్షలు పెట్టి మెస్సీతో ఫొటో దిగే అవకాశం దక్కించుకున్న ఫ్యాన్స్ అక్కడున్నారు.

గోట్ టూర్ లో భాగంగా హైదరాబాద్ లో మెస్సీ ఈవెంట్ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంత్...