భారతదేశం, మార్చి 22 -- Meerut murder: సంచలనం సృష్టించిన మీరట్ హత్య కేసులో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పుత్ (29)ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ముస్కాన్ రస్తోగి (27), సాహిల్ శుక్లా (25) హిమాచల్ ప్రదేశ్ లోని కసోల్ లో ఆరు రోజుల పాటు మకాం వేశారు. మార్చి 4న సౌరభ్ కు మత్తుమందు ఇచ్చి అతని భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ కలిసి కత్తితో పొడిచి చంపారు. అతని మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి సిమెంట్ తో డ్రమ్ములో సీల్ చేశారు.

నేరం చేసిన తర్వాత వీరిద్దరూ ప్రైవేట్ క్యాబ్ లో హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి తిరిగి మార్చి 17న మీరట్ కు తిరిగి వచ్చారు. భార్యాభర్తలుగా పరిచయం చేసుకుని మార్చి 10న కసోల్ లోని ఓ హోటల్ కు వెళ్లి ఆరు రోజుల పాటు అక్కడే ఉండి మార్చి 16న వెళ్లిపోయారు. వారి వెంట క్యాబ్ డ్రైవర్ కూడా ఉన్నా...