భారతదేశం, ఏప్రిల్ 18 -- త‌మిళ మెడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ట్రామా థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి టెంట్ కోట ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ట్రామా మూవీలో వివేక్ ప్ర‌స‌న్న‌, అనంత్ నాగ్‌, చాందిని త‌మిళ‌రాస‌న్‌, పూర్ణిమ‌ర‌వి కీల‌క పాత్ర‌లు పోషించారు. తంబిదొరై మ‌రియ‌ప్ప‌న్ ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

మార్చి 21న థియేట‌ర్ల‌లో రిలీజైన ట్రామా మూవీ యావ‌రేజ్‌గా నిలిచింది. అంథాల‌జీ ఫార్మెట్‌లో మూడు క‌థ‌ల‌తో హైప‌ర్‌లింక్ స్క్రీన్‌ప్లే విధానంలో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. సంతాన సాఫ‌ల్య కేంద్రాల పేరుతో జ‌రిగే మోసాల‌కు క్రైమ్ ఎలిమెంట్‌ను జోడించి ఈ మూవీ సాగుతుంది. ఐఎమ్‌డీబీలో ట్రామా మూవీ 7.9 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

సుంద‌ర్, గీతాల‌కు పెళ్లై చాలా ఏళ్ల‌యినా పిల్ల‌లు పుట్ట...