Hyderabad, ఫిబ్రవరి 11 -- Max OTT Release Date: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో జీ5 రూటే సెపరేటుగా కనిపిస్తోంది. ఈ ఓటీటీ సొంతం చేసుకున్న సినిమాలు ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్నాయి. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ హక్కులను సొంతం చేసుకున్న ఈ ఓటీటీ ముందుగా జీ తెలుగులో టీవీ ప్రీమియర్ చేయబోతోంది. ఇక ఇప్పుడు కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్ కూడా జీ కన్నడలోనే ముందుగా రానుంది.

కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్ మూవీ గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైంది. నెలన్నర రోజులుగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అతని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. వాళ్లందరికీ షాకిస్తూ మూవీ టీవీ ప్రీమియర్ తేదీని అనౌన్స్ చేశారు. ఈ సినిమా వచ్చే శనివారం (ఫిబ్రవరి 15) రాత్రి 7.30 గంటలకు జీ కన్నడ ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. ఫిబ్రవరి 22 నుంచి మ్యాక్స్ మూవీ జీ5 ఓటీటీలో ...