భారతదేశం, సెప్టెంబర్ 7 -- మారుతీ సుజుకీ కొత్తగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ అయిన విక్టోరిస్​ని భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి మోడళ్లు ఇప్పటికే ఉన్న ఈ రద్దీగా ఉండే సెగ్మెంట్‌లో విక్టోరిస్ అడుగుపెట్టింది. విభిన్నమైన ఇంజిన్ ఎంపికలు, విస్తృత శ్రేణి వేరియంట్‌లతో మార్కెట్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకోవాలని మారుతీ ప్రయత్నిస్తోంది. అయితే, కారు కొనాలనుకునే వారికి తరచుగా ఎదురయ్యే పెద్ద ప్రశ్న: ఏ వేరియంట్‌ను ఎంచుకోవాలి? ఈ నేపథ్యంలో విక్టోరిస్​ వేరియంట్లు, వాటి ఫీచర్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

1. ఎల్​ఎక్స్​ఐ వేరియంట్

ఎల్​ఎక్స్​ఐ అనేది మారుతీ సుజుకీ విక్టోరిస్​ ఎస్​యూవీలో బేస్ వేరియంట్. ఇది స్టీల్ వీల్స్, హాలోజన్ ల్యాంప్స్, మాన్యువల్ ఏసీతో వస్తుంది.

భద్రత పరంగా డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస...