భారతదేశం, అక్టోబర్ 3 -- కొత్తగా విడుదలైన మారుతీ సుజుకీ 'విక్టోరిస్' ఎస్​యూవీకి బంపర్​ డిమాండ్​ కనిపిస్తోంది! 2025 సెప్టెంబర్ 15న విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు విక్టోరిస్‌కు ఏకంగా 25,000 పైగా బుకింగ్‌లు నమోదయ్యాయని సంస్థ వెల్లడించింది. ఫలితంగా మారుతీ సుజుకీకి మంచి జోష్​ వచ్చినట్టు అయ్యింది! ఈ భారీ స్పందన కారణంగా, కొత్త విక్టోరిస్ వెయిటింగ్​ పీరియడ్​ ఇప్పుడు వేరియంట్‌ను బట్టి దాదాపు 10 వారాలకు పైగా పెరిగింది!

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల ఫలితంగా ధరలు మరింత పోటీగా ఉండటం, మారుతీ సుజుకీ విక్టోరిస్ సైతం సరిగ్గా పండుగల సీజన్‌కు ముందే మార్కెట్‌లోకి రావడం మారుతీ సుజుకీకి కలిసి వచ్చింది. ఇది మారుతీ సుజుకీ అరీనా వాహనాల విక్రయ కేంద్రాల (డీలర్‌షిప్ నెట్‌వర్క్)లో కొత్తగా ప్రవేశపెట్టిన ముఖ్య వాహనంగా ఉంది. దీనివల్ల ఈ ఎస్‌యూవీకి విస్తృత విక్రయ వే...