భారతదేశం, ఫిబ్రవరి 25 -- మారుతీ సుజుకీ సియాజ్​ సెడాన్​కి సంస్థ గుడ్​బై చెబుతోంది! నెక్సా ప్రీమియం రిటైల్ నెట్​వర్క్​ ద్వారా విక్రయించే ఈ సియాజ్​ ప్రొడక్షన్​ని 2025 మార్చ్​లో ఆపేయాలని, ఇప్పటికే ఉన్న యూనిట్స్​ని ఏ ఏడాది ఏప్రిల్​ నాటికి విక్రయించాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, ఫోక్స్​వ్యాగన్ విర్టస్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతున్న ఈ సియాజ్​ని నిలిపివేయడంతో ఇండియాతో పాటు ప్రపంచ ఆటోమొబైల్​ ఇండస్ట్రీలో ఎస్​యూవీ, క్రాసోవర్​ మధ్యలో నలిగిపోతున్న సెడాన్​ పరిస్థితికి అద్దంపడుతోంది. మరీ ముఖ్యంగా నెక్సా​ రిటైల్​ చెయిన్​ ద్వారా తమ తొలి ఎలక్ట్రిక్​ వాహనం మారుతీ సుజుకీ ఈ విటారాని విక్రయించేందుకు ఓవైపు ప్లాన్​ చేస్తూనే, మరోవైపు సియాజ్​ని నిలిపివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా సెడాన్ కార్ల అమ్...