భారతదేశం, ఫిబ్రవరి 11 -- మారుతీ సుజుకీ సెలెరియో శ్రేణిలో ఆరు ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్​గా అప్ డేట్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. దీనితో సెలెరియో హ్యాచ్​బ్యాక్​ భారతదేశంలో ఆరు ఎయిర్ బ్యాగులను ప్రామాణికంగా కలిగి ఉన్న అత్యంత సరసమైన కారుగా నిలిచింది! అంతేకాదు లేటెస్ట్​ అప్డేట్​తో సెలెరియో ధర కూడా పెరిగింది.

సెలెరియో ఎంట్రీ లెవల్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ .27,500 పెరిగింది. మారుతీ సుజుకీ సెలెరియో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .5.64 లక్షలుగా ఉంది. వీఎక్స్ఐ ఎంటీ, వీఎక్స్ఐ సీఎన్జీ ఎంటి వేరియంట్ల ధర రూ .16,000, వీఎక్స్ఐ ఏఎమ్​టీ ధర రూ .21,000 పెరిగింది. జెడ్ఎక్స్ఐ ఎంటీ, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఎంటీ వేరియంట్ల ధరలు రూ.27,500 పెరిగాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జెడ్ఎక్స్ఐ ఏఎమ్​టీ ధరలు మారనప్పటికీ, జెడ్ఎక్స్ఐ + ఏఎమ్​టీ ఇప్పుడు రూ .32,500 పెరిగింది. టాప్ ఎండ్...