భారతదేశం, ఫిబ్రవరి 25 -- ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీలు, ఎలక్ట్రిక్​ వాహనాల దండయాత్రను కొన్ని చిన్న కార్లు మాత్రమే తట్టుకోగలుగుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి మారుతీ సుజుకీ ఆల్టో కే10. ఇది భారతీయులకు ఎంతో సుపరిచితమైన మోడల్​. ఎందరో మధ్యతరగతి కుటుంబాల మొదటి కారు ఈ మారుతీ సుజుకీ ఆల్టో కే10. ఇక్కడ అసలు ప్రత్యేక ఏంటంటే, ఈ చిన్న కారు సేల్స్​ ఏమాత్రం తగ్గడం లేదు! 2025 జనవరిలో 11,352 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరి మీరు కూడా సొంత కారు కలలను నిజం చేసుకోవాలని చూస్తున్నారా? తక్కువ బడ్జెట్​లో మంచి వెహికిల్​ తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఆల్టో కే10 ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ ఆల్టో కే10 రెండు ఇంజిన్​ ఆప్షన్స్​తో లభిస్తుంది. అవి పెట్రోల్​, సీఎన్జీ. పూర్తి వివరాలు...