భారతదేశం, ఏప్రిల్ 7 -- దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్ 8 నుంచి ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనుంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వరుసగా రెండుసార్లు ధరల పెంపు తర్వాత 2025లో వాహన తయారీ సంస్థ నుంచి ఇది మూడో ప్రైజ్​ హైక్​ కావడం గమనార్హం. వేరియంట్లు బట్టి వివిధ మోడళ్ల ధరలను రూ.2,500 నుంచి రూ.62,500 వరకు పెంచనుంది మారుతీ సుజుకీ. చివరిగా ఫిబ్రవరి 1న వివిధ మోడళ్లపై రూ.32,500 వరకు ప్రైజ్​ హైక్​ తీసుకుంది.

మారుతీ సుజుకీ గత నెలలోనే ఈ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది. పెరుగుతున్న ఇన్​పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, రెగ్యులేటరీ మార్పులు, ఫీచర్ చేర్పులు వంటివి తాజా ప్రైజ్​ హైక్​కి కారణాలుగా పేర్కొంది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి, తన వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించడానికి కట్టుబడి ఉన్నప్పటికీ, పెరిగిన ఖర్చుల్లో కొన్నింటిని బ...