Hyderabad, జనవరి 31 -- Marco OTT Release Date: వాలెంటైన్స్ డేనాడు మోస్ట్ వయోలెంట్ మూవీని చూడటానికి సిద్ధంగా ఉండండి. ఉన్ని ముకుందన్ నటించిన మార్కో మూవీ ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీలివ్ ఓటీటీ శుక్రవారం (జనవరి 31) తన ఎక్స్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసింది.

మలయాళం సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన ఎ-రేటెడ్ మూవీగా నిలిచిన మార్కో (Marco) ఓటీటీలోకి వచ్చేస్తోంది. గతేడాది డిసెంబర్ 24న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సరిగ్గా 50 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా సోనీలివ్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్లు ఓటీటీలోకి రానుండగా.. హిందీ వెర్షన్ పై మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. నిజానికి హిందీ వెర్...