భారతదేశం, ఫిబ్రవరి 27 -- మార్చి నెలలో వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఎంట్రీ ఇచ్చేందుకు కొన్ని తెలుగు సినిమాలు రెడీ అయ్యాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్లాక్‍బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం కూడా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. సూపర్ హిట్ తండేల్ కూడా ఓటీటీలో అడుగుపెట్టనుంది. అల్ట్రా డిజాస్టర్ అయిన లైలా కూడా ఇదే నెలలో ఓటీటీలోకి రానుంది. మరో రెండు తెలుగు చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మార్చి నెలల్లో ఓటీటీల్లోకి వచ్చే టాప్-5 తెలుగు చిత్రాలు ఇవే..

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.300కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజై అదరగొట్టింది. ఈ సినిమా భారీ సక్సెస్ అవడంతో ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమైంది. ఎట్...