భారతదేశం, ఫిబ్రవరి 18 -- మంచు కుటుంబంలో ఆస్తి తగాదాలు కొన్ని రోజులుగా సాగుతున్నాయి. తండ్రి మంచు మోహన్ బాబు, అన్న విష్ణుతో మంచు మనోజ్ విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇరు వైపుల దాడులు, ప్రతిదాడులు సాగాయి. పోలీస్ స్టేషన్‍కు కూడా పలుసార్లు పంచాయతీ చేరింది. ఇప్పుడు తాజా మరోసారి ఇంకో రచ్చ జరిగింది. అర్ధరాత్రి హైడ్రామా తర్వాత తిరుపతి జిల్లాలోని భాకరాపేట పోలీస్ స్టేషన్‍లో నిరసన వ్యక్తం చేశారు మనోజ్. ఏం జరిగిందంటే..

తిరుపతి సమీపంలోని లేక్ వ్యాలీ రిసార్టులో మంచు మనోజ్ బస చేశారు. ఈ తరుణంలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు ఆ రిసార్టుకు వెళ్లారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే, తాను ఎందుకు వెళ్లాలని, తన గోప్యతకు భంగం కలిగిస్తున్నారని పోలీసులపై మనోజ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

అయితే, తమ యూనివర్సిటీ వ్యవహారంలో మరోసారి కల్పించుకునేంద...