Hyderabad, ఏప్రిల్ 22 -- Malayalam OTT Releases: మలయాళం సినిమాలు మెచ్చే తెలుగు ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూసే. కొన్ని మోస్ట్ అవేటెడ్ మాలీవుడ్ మూవీస్ మే నెలలో ఓటీటీలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిలో బ్లాక్‌బస్టర్ మూవీ అలప్పుజ జింఖానా కూడా ఉంది. మరి మిగిలిన ఆ సినిమాలు ఏవో కూడా తెలుసుకోండి.

మలయాళ స్టార్ హీరో బేసిల్ జోసెఫ్ నటించిన మూవీ ఈ మరణమాస్. కామెడీతోపాటు ఎమోషనల్ సీన్లనూ పండించే నటుడు ఇతడు. బేసిల్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే అతడు నటించిన పొన్‌మ్యాన్ మూవీ జియోహాట్‌స్టార్ లో, ప్రవింకూడు షాప్పు మూవీ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కామెడీ, డార్క్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ మరణమాస్ మూవీ కూడా మే నెలలో ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

ప్రేమలు మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా ద...