భారతదేశం, మార్చి 29 -- ఈనెల మార్చిలో ఓటీటీల్లో మలయాళ చిత్రాలు జోరుగా వచ్చాయి. థ్రిల్లర్స్ నుంచి కామెడీ వరకు డిఫరెంట్ జానర్ల సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో 5 మలయాళ చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా నిలిచాయి. ఎంతగానో ఎదురుచూసిన థ్రిల్లర్ సినిమాలు ఇదే నెలలో ఓటీటీలో అడుగుపెట్టాయి. ఫ్యామిలీ డ్రామా చిత్రాలు వచ్చాయి. మార్చిలో ఓటీటీల్లోకి వచ్చిన టాప్-5 మలయాళ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

మలయాళ ఫ్యామిలీ డ్రామా చిత్రం నారాయణీతే మూన్నన్‍మక్కల్ సినిమా మార్చి 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మీవీలో జోజూ జార్జ్, అలెన్సియర్ లే లోపేజ్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలు పోషించారు. నలుగురు అన్నదమ్ముల మధ్య ఈ చిత్రం సాగుతుంది. శరణ్ వేణుగోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో ఫిబ్రవరిలో విడుదలైంది. మంచి టాక్ తెచ్చుక...