భారతదేశం, ఏప్రిల్ 15 -- మలయాళ బ్లాక్ కామెడీ మూవీ 'జయ జయ జయ జయ హే' చిత్రం భారీ హిట్ సాధించింది. లోబడ్జెట్‍తో వచ్చిన ఈ మూవీ ప్రశంసలను దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‍గా బ్లాక్‍బస్టర్ కొట్టింది. బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2022 అక్టోబర్‌లో విడుదలైంది. ఈ సినిమా తనకు బాగా నచ్చడంతో హిందీలో రీమేక్ చేయాలని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అనుకున్నారు. రీమేక్‍ను ప్రొడ్యూజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారట.

జయ జయ జయ జయ హే హిందీ రీమేక్ ఎందుకు పట్టాలెక్కలేదో నటుడు అజీజ్ నెడుమంగద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ చిత్రంలోని సపోర్టింగ్ పాత్రలకు సూటయ్యే నటీనటులు హిందీలో దొరకలేదని, అందుకే ఈ రీమేక్ నుంచి ఆమిర్ ఖాన్ డ్రాప్ అయ్యారని వెల్లడించారు.

హిందీ వెర్షన్‍కు కూడా మలయాళంలో నటించిన కొందరిని తీస...