భారతదేశం, ఫిబ్రవరి 17 -- మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ ఎలక్ట్రిక్​ కారు బుకింగ్స్​ దేశవ్యాప్తంగా గత వారమే మొదలయ్యాయి. ఈ మోడల్​కి కస్టమర్స్​ నుంచి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. మరి మీరు కూడా ఎక్స్​ఈవీ 9ఈని బుక్​ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి. ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని మీ బడ్జెట్​ని ప్లాన్​ చేసుకోండి.

అంటే, హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 23.01 లక్షల నుంచి రూ. 32.20 లక్షల వరకు ఉంటుందని అర్థం.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉ...