భారతదేశం, ఫిబ్రవరి 21 -- మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో ఎన్ బ్లాక్ ఎడిషన్​ని భారత మార్కెట్​లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ బ్రాండ్ తమ సోషల్ మీడియా పేజి​ల్లో.. ఈ ఎస్​యూవీకి సంబంధించిన కొత్త టీజర్​ని విడుదల చేసింది. అప్​డేటెడ్ ఎస్​యూవీ ఇప్పటికే కొన్ని డీలర్​షిప్ యార్డులకు చేరుకోవడం ప్రారంభించిందని సమాచారం. కాబట్టి ఈ బ్లాక్​ ఎడిషన్​ ఇంకొన్ని రోజుల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహీంద్రా స్కార్పియో ఎన్​ బ్లాక్​ ఎడిషన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా స్కార్పియో ఎన్ బ్లాక్ ఎడిషన్​లో కాస్మొటిక్ మార్పులు మాత్రమే కనిపిస్తాయి. ఇది బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్​తో వస్తుంది. క్రోమ్ ఎలిమెంట్స్ అన్నింటికీ ఇప్పుడు బ్లాక్​ కలర్​ ఫినిషింగ్​ లభిస్తుంది. బ్లాక్ లెదర్లెట్ అప్​హోలిస్ట్రీ, డ్యాష్ బ...