భారతదేశం, జనవరి 28 -- ఓవైపు కోట్లాది మంది భక్తులు మహా కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానాలు చేస్తుంటే, మరోవైపు విమాన టికెట్​ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మహా కుంభమేళతో వస్తున్న డిమాండ్​ని క్యాష్​ చేసేందుకు.. అనేక విమానయాన సంస్థలు పోటీపడి మరీ టికెట్​ రేట్లను పెంచుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల, టికెట్​ ధరలు సాధారణం కన్నా 3 నుంచి 6రెట్లు ఎక్కువ చూపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహా కుంభమేళా కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్​రాజ్​కు వెళ్లి వచ్చేందుకు విమాన టికెట్​ ధరలు భారీగానే పెరిగాయి. మరీ ముఖ్యంగా రిటర్న్​ టికెట్​ రేట్లకు రెక్కలు వచ్చాయి. ప్రయాగ్​రాజ్​ నుంచి చెన్నైకి తిరిగి వెళ్లాలంటే రూ. 30వేల వరకు ఖర్చు అవుతోంది. ఇక కోల్​కతాకి అది రూ. 32,500 వరకు ఉంది. హైదరాబాద్​ విషయం మరింత ఆందోళనకరంగా ఉంది. ...