భారతదేశం, మార్చి 30 -- మ్యాడ్ స్క్వేర్ సినిమా చాలా అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2023లో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన మ్యాడ్‍కు సీక్వెల్ కావటంతో విపరీతమైన హైప్ మధ్య రిలీజైంది. సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ చేసిన మ్యాడ్ స్క్వేర్ ఈ శుక్రవారం మార్చి 28న విడుదలైన బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. రెండో రోజు కూడా అదరగొట్టింది.

మ్యాడ్ స్క్వేర్ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 37.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ నేడు (మార్చి 30) వెల్లడించింది. బ్లాక్‍బస్టర్ మ్యాడ్ స్క్వేర్, హ్యాపీ ఉగాది అంటూ కలెక్షన్ల లెక్కతో పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. థియేటర్లలో మ్యాడ్ సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయంటూ రాసుకొచ్చింది.

తొలి రోజు రూ.20.8 ...