భారతదేశం, సెప్టెంబర్ 1 -- సోమవారం, సెప్టెంబర్ 1 నుంచి చమురు మార్కెటింగ్ సంస్థలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 51.50 మేర తగ్గించాయి. అయితే, గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్​ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

కొత్త ధరల ప్రకారం.. వివిధ నగరాల్లో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరలు ఇలా ఉన్నాయి:

దిల్లీ: గతంలో రూ. 1,631.50గా ఉన్న ధర ఇప్పుడు రూ. 1,580కి తగ్గింది.

కోల్‌కతా: కొత్త ధర రూ. 1,684.

ముంబై: కొత్త ధర రూ. 1,531.5.

చెన్నై: కొత్త ధర రూ. 1,738.

హైదరాబాద్​లో 19 కేజీల కమర్షియల్​ ఎల్పీజీ సిలిండర్​ ధర రూ. 1,801.50గా ఉంది. ఇక 14.2 కేజీల సిలిండర్​ ధర రూ. 905గా కొనసాగుతోంది.

వరంగల్​లో 19కేజీల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర రూ. 1,841.50గాను, ఇళ్లల్లో వినియోగించే 14.2 కేజీల సిలిండర్​ ధర రూ. 924గాను ఉంది. ...