భారతదేశం, ఫిబ్రవరి 1 -- దేశ ప్రజలకు గుడ్​ న్యూస్​! ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరలను చమురు మార్కెటింగ్​ సంస్థలు భారీగా తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్​ ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరను రూ. 7 తగ్గించినట్టు, ఇది ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించాయి.

తాజా తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర రూ. 1797కు చేరింది.

ఈ కమర్షియల్​ గ్యాస్​ సిలిండర్లను రెస్టారెంట్​తో పాటు వివిధ వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. వీటి ధరలు తగ్గితే, ఆయా చోట్ల ప్రజలకు సైతం కాస్త రిలీఫ్​ వచ్చే అవకాశం ఉంటుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....