భారతదేశం, ఏప్రిల్ 1 -- నూతన ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ప్రజలకు గుడ్​ న్యూస్​ అందింది! ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరలను చమురు మార్కెటింగ్​ సంస్థలు తగ్గించాయి. తాజా ప్రకటన ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్​పీజీ సిలిండర్ ధర రూ .41 దిగొచ్చింది. ఫలితంగా నేడు దేశవ్యాప్తంగా ఈ సిలిండర్ చౌకగా మారింది.

ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల ఎల్​పీజీ సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి రూ .41 తగ్గి రూ .1762కు చేరుకుంది. అంతకుముందు మార్చ్​లో ఇది రూ.1803గా ఉంది. అదే సమయంలో పాట్నాలో రూ.2031గా ఉంది.

కోల్​కతాలో మార్చ్​లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1913గా ఉంది. నేడు రూ.44.50 తగ్గి రూ.1868.50కి చేరింది. ముంబైలో ఎల్​పీజీ సిలిండర్ ధర రూ.1755.50 నుంచి రూ.1713.50కి తగ్గింది.

మరోవైపు చెన్నైలో కమర్షియల్​ సిలిండర్​ ధర రూ. 1965...