భారతదేశం, మార్చి 9 -- ఏదైనా లోన్​ తీసుకోవడానికి క్రెడిట్​ స్కోర్​ అన్నది చాలా ముఖ్యం! తక్కువ వడ్డీకి లోన్​ పొందడానికి లేదా అసలు లోన్​ అర్హత ఉందా లేదా అని నిర్ణయించడానికి క్రెడిట్​ స్కోర్​ని చూస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో.. అసలు లోనే తీసుకోకపోయినా క్రెడిట్​ స్కోర్​ తక్కువగా ఉంటుంది. ఇందుకు కారణాలు ఏంటంటే..

1. క్రెడిట్ హిస్టరీ లేకపోవడం: మీరు ఎప్పుడూ రుణం లేదా క్రెడిట్ కార్డు తీసుకోకపోతే, సీఆర్ఐఎఫ్ హై మార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు - మీ క్రెడిట్ స్కోరును అంచనా వేయడానికి డేటాను కలిగి ఉండవు. విద్యార్థులు లేదా ఎల్లప్పుడూ నగదు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లించే యువతలో ఇది సాధారణం కావచ్చు.

2. ఇనాక్టివ్ క్రెడిట్ కార్డు: మీకు క్రెడిట్​ కార్డు ఉన్నప్పటికీ దానిని ఎప్పుడూ ఉపయోగించకపోతే, క్రెడిట్ బ్యూరోలు మీరు క్రెడిట్​ని ఎలా నిర్వహించాలో అంచన...