భారతదేశం, ఫిబ్రవరి 22 -- సరికొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని లాంచ్​ చేసింది నైంటీ వన్ అనే సంస్థ. సిటీ డ్రైవ్​కి సరిపోయే విధంగా ఉన్న నైంటీ వన్​ ఎక్స్​ఈ సిరీస్​ ఈ-స్కూటర్​లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. 80 కి.మీ రేంజ్​ని ఇచ్చే ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర చాలా చాలా తక్కువ! పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎక్స్ఈ సిరీస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​​లో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 80 కిలోమీటర్లకు రేంజ్​ని ఇస్తుందని సంస్థ చెబుదోంది. లో-స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాల నిబంధనలకు అనుగుణంగా ఈ మోడల్​ టాప్​ స్పీడ్​ గంటకు 25 కిలోమీటర్లకు పరిమితమైంది.

కంట్రోల్డ్​ రైడింగ్ కోసం రూపొందించిన ఎక్స్ఈ సిరీస్ టాప్​ స్పీడ్​ గంటకు 25 కిలోమీటర్లే కావడంతో ఇది సురక్షితమైన ఎక్స్​పీరియెన్స్​ని ఇస్తుంది. మరీ ముఖ్యంగా మొదటిసారి స్కూటర్​ నడుపుతున్న వ...