భారతదేశం, ఏప్రిల్ 28 -- 2024 Lok Sabha elections : దేశవ్యాప్తంగా 2024 లోక్​సభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఇప్పటికే రెండు దశల పోలింగ్​ ప్రక్రియ ముగిసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా.. త్వరలోనే ఎన్నికల హడావుడి జోరందుకోనుంది. మే 13న.. ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. తెలంగాణలో కూడా లోక్​సభ ఎన్నికల పోలింగ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఓటింగ్ కోసం కేటాయించిన పోలింగ్ బూత్​ను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సాధారణంగా ఓటర్ ఐడీ కార్డు అని పిలిచే ఎలక్షన్ ఫోటో ఐడీ కార్డు (ఈపీఐసీ).. భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) జారీ చేసిన ప్రత్యేకమైన 10 అంకెల ఆల్ఫా-న్యూమెరిక్ కోడ్​ను కలిగి ఉంటుంది. ఈ కోడ్ మీ ఓటరు రిజిస్ట్రేషన్​ స్టేటస్​ని రుజువుగా పనిచేస్తుంది. ఇది.. మీ ఓటర్​ ఐడీ కార్డు ముందు భాగంలో ప్రముఖంగా కనిపిస్తుంది. ప...