భారతదేశం, ఏప్రిల్ 6 -- ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ ప్రపంచం నుంచి మరొక కీలక అప్డేట్​! Llama 4 లో రెండు కొత్త మోడల్స్​ని లాంచ్​ చేసింది మార్క్​ జుకర్​బర్గ్​ నేతృత్వంలోని మెటా సంస్థ. అవి.. Llama 4 Scout (లామా 4 స్కౌట్​), Llama 4 Maverick (లామా 4 మేవరిక్​). వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​ వంటి మెటా ఆధారిత యాప్స్​లోని చాట్​బాట్​కి ఇవి మరింత 'ఏఐ' పవర్​ని ఇవ్వనున్నాయి. వీటిని మెటా వెబ్సైట్, హగ్గింగ్ ఫేస్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

ఈ మోడళ్లతో పాటు, మెటా లామా 4 బెహెమోత్ అనే మరొక మోడల్​ని కూడా ప్రివ్యూ చేసింది. ఇది "ప్రపంచంలోని అత్యంత తెలివైన ఎల్ఎల్ఎమ్​లలో ఒకటి. మా కొత్త మోడళ్లకు టీచర్​గా పనిచేయడానికి మా అత్యంత శక్తివంతమైనది," అని మెటా పేర్కొంది.

మెటా తన లామా 4 మోడళ్లకు పెద్ద మొత్తంలో అన్​లేబుల్డ్​ టెక్స్ట్, ఇమేజ్, వీడియో డేటాపై ముందస్తు శిక్షణ ఇవ్...