భారతదేశం, ఫిబ్రవరి 12 -- Liquor Margins: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గుతాయని ఎదురు చూస్తోన్న వారికి కూటమి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఇక ధరలు తగ్గే అవకాశం లేదని చెప్పకనే చెప్పేసింది. జగన్‌ బాటలోనే ఎనిమిది నెలలుగా మద్యం ధరల్ని కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడ బాటిల్‌పై మరో రూ.10 అదనపు వసూలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై మద్యం కొనుగోలు దారుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఐదేళ్లు మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని విమర్శించిన వారు ఇప్పుడు ధరల్ని పెంచడాన్ని బహిరంగంగానే విమర‌్శిస్తున్నారు.

ఏపీలో మద్యం ధరలు తగ్గవని స్పష్టత వచ్చేసింది. మద్యం ధరలపై రిటైల్ మార్జిన్ సవరిస్తూ మంగళవారం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో బాటిల్‌ మీద రూ.10 అనే వివరణ ఎక్కడా ఇవ్వలేదు. అదనపు రిటైల్‌ వసూళ్లను మద్యం ధరల ఆధారంగా వసూలు...