భారతదేశం, మార్చి 9 -- లైలా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. యంగ్ హీరో విశ్వక్‍సేన్ హీరోగా నటించిన ఈ మూవీ క్రేజ్ మధ్య ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఈ కామెడీ యాక్షన్ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. కమర్షియల్‍గా ప్లాఫ్ అవడంతో పాటు విమర్శలను మూటగట్టుకుంది. ఈ లైలా చిత్రం నేడు (మార్చి 9) ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.

లైలా సినిమా నేడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తెలుగులో ఒక్కటే ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన సుమారు మూడు వారాలకు ఈ లైలా చిత్రం ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది.

లైలా చిత్రం మార్చి 7వ తేదీనే అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వస్తుందనేలా రూమర్లు బలంగా వినిపించాయి. ఆహా కూడా స్ట్రీమింగ్ హక్కులను దక్...