భారతదేశం, మే 1 -- Laapata Ladies OTT: లాపతా లేడీస్ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శలకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ఈ మూవీకి సూపర్ మంచి స్పందన వచ్చింది. రూ.4కోట్లలోపు బడ్జెట్‍తో తెరకెక్కించిన ఈ మూవీకి రూ.20 కోట్ల వసూళ్లు వచ్చాయి. లాతపతా లేడీస్ చిత్రానికి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించారు. లాపతా లేడీస్ చిత్రం ఇటీవలే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ మూవీపై స్పందించారు.

లాపతా లేడీస్ సినిమా ఏప్రిల్ 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలో చూసిన వారి నుంచి ఈ చిత్రానికి చాలా మంచి స్పందన వస్తోంది. ఓటీటీ రిలీజ్ తర్వాత చాలా...