భారతదేశం, జనవరి 2 -- Kurnool Student: ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థినిపై గురుకుల కాలేజీ లైబ్రేరియన్ లైంగిక వేధింపులు పాల్పడుతుండటం తెలిసిన బాలిక బంధువులు చితకబాదడం సంచలనం సృష్టించింది. కర్నూలు జిల్లా బనవాసిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బనవాసిలోని ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్‌ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై లైబ్రేరియన్ మద్దిలేటి వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు బుధవారం లైబ్రేరియన్‌పై దాడి చేశారు.

దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన అడ్డువచ్చిన ప్రిన్సిపల్ శ్రీనివాసగుప్తాను కూాడ చితకబాదారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. బనవాసిలో ఉన్న ఏపీ గురు కుల జూనియర్ కాలేజీలో 260 మంది విద్యార్థినులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

ఈ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న వ...