Hyderabad, మార్చి 28 -- Krrish 4 Director: క్రిష్ ఫ్రాంఛైజీ తెలుసు కదా. అప్పుడెప్పుడో 22 ఏళ్ల కిందట కోయి మిల్ గయా మూవీ నుంచి మొదలైన సూపర్ హీరో మూవీస్ ఫ్రాంఛైజీ.. ఇప్పుడు నాలుగో సినిమాతో వస్తోంది. క్రిష్ 4ను అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా కోసం తొలిసారి డైరెక్టర్ గా మారనున్నాడు స్టార్ హీరో హృతిక్ రోషన్.

2003లో వచ్చిన కోయి మిల్ గయాతోపాటు తర్వాత వచ్చిన క్రిష్, క్రిష్ 3 సినిమాలను హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ డైరెక్ట్ చేశాడు. కానీ ఈ నాలుగో మూవీని మాత్రం హృతిక్ రోషనే డైరెక్ట్ చేయనుండటం విశేషం. ఆదిత్య చోప్రా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని రాకేష్ రోషన్ వెల్లడించాడు.

25 ఏళ్ల కిందట తాను డైరెక్టర్ గా హృతిక్ ను హీరోగా పరిచయం చేశానని, ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత డైరెక్టర్ గా అతన్ని తనతోపాటు మరో డైరెక్టర్ ఆదిత్య చోప్రా లాంచ్ చేస్తు...