భారతదేశం, ఫిబ్రవరి 8 -- పశ్చిమ్​ బెంగాల్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! తల్లి తిట్టిందని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక హత్యకు గురైంది. ఆమెను రేప్​ చేసి చంపేశారని పోలీసులు చెబుతున్నారు.

కోల్​కతా న్యూ టౌన్​లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. తల్లి తిట్టడంతో 8వ తరగతి చదువుకుంటున్న బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. కాగా శుక్రవారం ఉదయం బాలిక ఇంటికి 6 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం కనిపించింది.

"ఒక బాలిక అర్ధనగ్న మృతదేహం ఈ ఉదయం ఒక ఒంటరి ప్రదేశంలో లభించింది. మేము హత్య కేసు నమోదు చేసి, పోక్సో చట్టం సెక్షన్లను కూడా చేర్చాము. దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటివరకు ఎవరూ అరెస్ట్ కాలేదు," అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

పోలీసుల ప్రకారం, ఆ బాలిక గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తల్లి తిట్టడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక...