భారతదేశం, ఫిబ్రవరి 25 -- ఇంతకాలం చిన్న కార్లు, వాల్యూ ఫర్​ మనీ వేరియంట్లకు పెద్దపీట వేసిన భారతీయులు ఇప్పుడు నిదానంగా 'ప్రీమియం'వైపు కదులుతున్నట్టు లేటెస్ట్​ ట్రెండ్స్​ సూచిస్తున్నాయి. కియా మోటార్స్​ లేటెస్ట్​ ఎస్​యూవీ కియా సైరోస్​ బుకింగ్స్​లో ఎక్కువ మొత్తం టాప్​ ఎండ్​ వేరియంట్లే ఉండటం విశేషం.

మహీంద్రా బీఈ 6, ఎక్స్​ఈవీ 9ఈ బుకింగ్స్​ ఇటీవలే ప్రారంభం కాగా, వచ్చిన ప్రీ-ఆర్డర్స్​లో చాలా వరకు ప్రీమియం వేరింట్లవే ఉన్నాయి.

జనవరి 3, 2025న ప్రారంభమైన కియా సైరోస్ బుకింగ్స్​లో ఇప్పటివరకు 20,000 ఆర్డర్లు వచ్చాయి. ఈ మోడల్​ ఫిబ్రవరి 1న లాంచ్ అయింది. ఫిబ్రవరి మధ్య నుంచి వాహన డెలివరీలు సైతం ప్రారంభమయ్యాయి. రూ .9 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి రూ .17 లక్షల మధ్య ధర కలిగిన కియా సైరోస్ ఆరు వేరియంట్లుస రెండు ఇంజిన్ ఆప్షన్స్​తో లభిస్తుంది. బుకింగ్స్​లో హైఎండ్ వేరి...