భారతదేశం, ఫిబ్రవరి 21 -- మచ్​ అవైటెడ్​ 2025 కియా సెల్టోస్​ ఇండియన్​ మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. ఈ బెస్ట్​ సెల్లింగ్​ కియా ఎస్​యూవీ ఇప్పుడు స్మార్ట్ స్ట్రీమ్ జీ 1.5, డీ 1.5 సీఆర్​డీఐ వీజీటీ ఇంజిన్ ఆప్షన్స్​ కలిగి ఉన్న ఎనిమిది అదనపు వేరియంట్లతో వస్తోంది! ఈ కొత్త చేర్పులతో, సెల్టోస్ ఇప్పుడు వివిధ కాన్ఫిగరేషన్లతో మొత్తం 24 వేరియంట్స్​లో అందుబాటులో ఉంది. అప్డేటెడ్ సెల్టోస్ హెచ్​టీఈ(ఓ) వేరియంట్ ధర రూ.11.13 లక్షల నుంచి ప్రారంభమై ఎక్స్ లైన్ మోడల్ ధర రూ.20.50 లక్షల వరకు ఉంటుంది.

రూ.11.13 లక్షల ఆకర్షణీయమైన ధర కలిగిన 2025 కియా సెల్టోస్​ హెచ్​టఈఈ(ఓ) వేరియంట్ మీ డ్రైవింగ్ అనుభవాన్ని ఎలివేట్ చేయడానికి సహాయపడే అనేక ఫీచర్లతో వస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీని అందించే 8 ఇంచ్​ టచ్​స్క్రీన్​, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్​, ఆడియో కంట్రోల్స్​తో కూడిన స్టీరింగ్ వీల...