భారతదేశం, ఫిబ్రవరి 17 -- ప్రపంచంలో ఉన్న 'ఎలక్ట్రిక్​' వార్​ని కియా మోటార్స్​ మరింత పెంచింది! ఫిబ్రవరి 27న కియా ఈవీ4ని సంస్థ ఆవిష్కరిస్తుండగా.. తాజాగా ఈ మోడల్​ ఫస్ట్​ లుక్​ని రివీల్​ చేసింది. ఈ లుక్​ని చూసిన వారందరు వావ్​ అంటున్నారు! కియా ఈవీ4 డిజైన్​ అదిరిపోయింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కియా ఈవీ ఎలక్ట్రిక్​ కారు ప్రొడక్షన్​లోకి వెళ్లే అవకాశం ఉంది. 2026లో అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ కోసం సంస్థ ప్లాన్​ చేస్తోంది. ఈ కియా ఈవీ4.. టెస్లా మోడల్​ 3, ఎంజీ 4, వోక్స్​వ్యాగన్​ ఐడీ.4 వంటి మోడల్స్​కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కియా ఈవీ4 ఫస్ట్​ లుక్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

2023లో మొదటిసారిగా ఈ ఈవీ4 కాన్సెప్ట్ వర్షెన్​ని కియా మోటార్స్​ ప్రదర్శించింది. ఇప్పుడు విడుదలైన ఫస్ట్​ లుక్​.. రెండేళ్ల క్రితం వచ్చిన కాన్...