Hyderabad, ఏప్రిల్ 16 -- Kesari 2 Movie: బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన మూవీ కేసరి 2. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజవుతోంది. అయితే అంతకుముందు మంగళవారమే (ఏప్రిల్ 15) ఢిల్లీలో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా మూవీని చూసి భావోద్వేగానికి గురైనట్లు వెల్లడించారు.

అక్షయ్ కుమార్ గతంలో కేసరి మూవీతో వచ్చి ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించిన విషయం తెలుసు కదా. ఇప్పుడదే హీరో కేసరి 2తో వస్తున్నాడు. ఈసారి జలియన్ వాలా బాగ్ ఘటనపై సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చూశారు. ఆ తర్వాత ఆమె ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తాను భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు.

"ఈ సినిమా నా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఆరోజు జలియన్‌వాలా బాగ్ లో ఎలా రక్తంతో నిండిన బైసాఖిని జరుపుకున్నారో చూస్తేనే గుం...