భారతదేశం, ఏప్రిల్ 14 -- ఐపీఎల్​ ప్రపంచంలో కావ్య మారన్​ చాలా ఫేమస్​! ఈ సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఓనర్​- సీఈఓ తన టీమ్​ని ఎల్లప్పుడు సపోర్ట్​ చేస్తుంటారు. టీమ్​ గెలుపోటముల్లో ఆమె హావాభావాల వీడియోలు తెగ వైరల్​ అవుతుంటాయి. అవి మీరు చాలానే చూసి ఉంటారు. అయితే, కావ్య మారన్​ దగ్గర ఉన్న కార్ల లిస్ట్​ గురించి మీకు తెలుసా? తెలిస్తే మాత్రం.. కావ్య- లగ్జరీకి కేరాఫ్​ అడ్రెస్​ అని కచ్చితంగా అనుకుంటారు. రూ. 400 కోట్లకుపైగా నెట్​వర్త్​ కలిగిన కావ్య మారన్​ గ్యారేజ్​లో బెంట్లే నుంచి బీఎండబ్ల్యూ వరకు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

బెంట్లే బెంటయ్గా ఈడబ్ల్యూబీ- బెంట్లే నుంచి వచ్చిన తొలి ఎస్​యూవీ ఇది. సన్​రైజర్స్​ హైదరాబాద్​ సీఈఓ కావ్య దగ్గర ఉన్న మోడల్​కి రెడ్​ ఫినిషింగ్​ వచ్చింది. ఇందులో 22 ఇంచ్​ వీల్స్​ ఉన్నాయి. ఇందులో 4.0 లీటర్​ ట్విన్​ టర్బ...