భారతదేశం, ఫిబ్రవరి 19 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 19) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దివాళా తీసే పరిస్థితిలో ఉన్న రెస్టారెంట్‍ను తమకు ఇవ్వాలని సత్యరాజ్‍ను కార్తీక్, దీప అడుగుతారు. జ్యోత్స్న రెస్టారెంట్‍ను నువ్వు అద్బుతంగా నడిపి.. నా రెస్టారెంట్‍ను దెబ్బకొట్టావని కార్తీక్‍తో సత్యరాజ్ అంటాడు. కంపెనీ నుంచి నిన్ను తీసేసినప్పుడు సంతోషించానని చెబుతాడు. ఎందుకు వచ్చారని కార్తీక్‍ను అడుగుతాడు. రెస్టారెంట్ కోసం అని కార్తీక్ అడిగితే.. కొంటారా అని సత్యరాజ్ ప్రశ్నిస్తాడు.

రెస్టారెంట్ కొనే స్థోమత తనకు లేదని కార్తీక్ అంటాడు. మరి ఎందుకు వచ్చారని సత్యరాజ్ ప్రశ్నిస్తాడు. ఇంతలో సత్యరాజ్‍కు తాను చేసిన వంటకాన్ని దీప ఇస్తుంది. ఆయన తింటాడు. టేస్ట్ చాలా బాగుందని చెబుతాడు. రెగ్యులర్ రెస్టారెంట్ స్టైల్ కాకుండా డిఫరెంట్‍గా ఉందని చెబుతాడు. తనకు వంటలు ఎలా చేయాలో బా...