భారతదేశం, మార్చి 20 -- Karnataka bandh: బెళగావిలో కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్ పై దాడిని నిరసిస్తూ కన్నడ అనుకూల సంఘాలు ఈ నెల 22, శనివారం రోజు 12 గంటల రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి.

మార్చి 22, శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కన్నడ ఓకూట ఆధ్వర్యంలో ఈ బంద్ ను రాజధాని బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

ఫిబ్రవరిలో బెళగావిలో మరాఠీలో మాట్లాడలేదనే కారణంతో కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్ పై మరాఠీ అనుకూల గ్రూపులు దాడి చేశారు. ఈ ఘటనకు నిరసనగా కన్నడ అనుకూల సంఘాలు సంయుక్తంగా ఈ బంద్ కు పిలుపునిచ్చాయి.

అవును, మార్చి 22 శనివారం బెంగళూరులో 12 గంటల బంద్ జరగనుంది. బంద్ కారణంగా ప్రజాసేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యా సంస్థలు, రవాణా, ప్రజా సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.

కర్ణాటక బంద్ కారణంగా మార్చి 22న రాష్ట్రవ్...