భారతదేశం, ఫిబ్రవరి 3 -- మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్న కన్నప్ప చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నారు. ఈ మైథలాజికల్ చిత్రంలో ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ప్రభాస్ ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత విపరీతంగా ఉంది. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్ ఏదోననే క్యూరియాసిటీ మొదటి నుంచి నెలకొంది. ఆ ఉత్కంఠ నేడు (ఫిబ్రవరి 3) వీడింది. కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. పాత్ర ఏదో కూడా తెలిసిపోయింది.

కన్నప్ప చిత్రం నుంచి వచ్చిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. మెడలో రుద్రాక్ష మాలలు, చేతిలో కర్ర, నుదుటన మూడు నామాలు, తిలకంతో ఓ సాధువులా ప్రభాస్ లుక్ ఉంది. ఈ పోస్టర్ మరింత ఆసక్తిని పెంచేసింది.

కన్నప్ప చిత్రంలో రుద్ర పాత్రను ప్రభాస్ పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్లో మూవీ టీమ్ వెల్లడించింది. "ప్రళయక...