భారతదేశం, జనవరి 26 -- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. గ్రాండ్ విజువల్స్, మైథాలజీ, భారీతనంతో ఈ మైథో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్, చివర్లో ట్విస్ట్ ఆకట్టుకున్నాయి. దీంతో కల్కి 2పై అంచనాలు, హైప్ భారీగా ఉన్నాయి. అయితే, ప్రభాస్ లైనప్‍లో చాలా చిత్రాలు ఉండటంతో కల్కి 2 ఎప్పుడు అనే సందేహం నెలకొంది. ఈ సీక్వెల్ చిత్రంపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా అప్‍డేట్ చెప్పారు.

కల్కి 2 మూవీకి సంబంధించిన స్టోరీ పనులు పూర్తయినట్టు డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెల్లడించారు. స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. ప్రభాస్ సిద్ధమైనప్పుడు షూటింగ్ మొదలుపెట్టేస్తామని అన్నారు. 2026 చివరి నాటికి కల్కి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ...